Loading...
Andhra Pradesh: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక.. నవంబర్‌ 11 నుంచి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించాలి
నవంబర్‌ 11 నుంచి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించాలి

Andhra Pradesh: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక.. నవంబర్‌ 11 నుంచి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించాలి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి విద్యార్థులకు ముఖ్యమైన ప్రకటన వెలువడింది. 2027లో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన ఫీజుల చెల్లింపు ప్రక్రియ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 25వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత నిర్ణీత గడువులను బట్టి ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

వివరాలు 

ఆలస్య రుసుము వివరాలు ఇవే..

ఈ నెల 26 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.

డిసెంబరు 3 నుంచి 9వ తేదీ వరకు రూ.200 ఫైన్‌ చెల్లించాలి. డిసెంబరు 10 నుంచి 15వ తేదీ వరకు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.

రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టుల వరకు పరీక్ష రాసే విద్యార్థులు రూ.110 చెల్లిస్తే సరిపోతుంది.

ఒకేషనల్‌ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. వయసు మినహాయింపు కోరుకునే విద్యార్థులు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలు 

పాఠశాల లాగిన్‌ ద్వారానే ఫీజు చెల్లింపు..

పరీక్ష ఫీజులను విద్యార్థులు నేరుగా చెల్లించడానికి వీల్లేదు. పాఠశాల లాగిన్‌ ద్వారానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది.

ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు UDISE+ వెబ్‌సైట్‌లో విద్యార్థుల వివరాలను అప్‌డేట్‌ చేసి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి.

వివరాల్లో తప్పులు లేకుండా చూసుకున్న తర్వాతే పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలి.

ఫీజు చెల్లింపుల కోసం https://bse.ap.gov.in వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలి.

CFMS లేదా బ్యాంకు చలాన్ల ద్వారా చెల్లించిన ఫీజులను అధికారులు స్వీకరించరు. నిర్ణయించిన గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేశారు.

కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.

ADVERTISEMENT

వివరాలు 

2027లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

అలాగే Manual Nominal Rolls (MNRs)ను ఎలాంటి స్థాయిలోనూ సమర్పించాల్సిన అవసరం లేదని పరీక్షల విభాగం వెల్లడించింది.

UDISE+లో విద్యార్థుల వివరాలను సరిచూసుకున్న తర్వాతే ఫీజు చెల్లింపులు పూర్తి చేయాలి.

అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం 2027లో పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9వ తేదీ వరకు పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్‌ టెస్టులు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు జరగనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

2027లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2027 ఏప్రిల్‌ 3 నుంచి 17వ తేదీ వరకు సమ్మెటివ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు.

ఇక పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2027 మార్చి 15 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు గడువుతో పాటు రాబోయే పరీక్షల తేదీలను కూడా గుర్తుంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT