#Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో దళిత బాలికకు ఘోర అవమానం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో దారుణం వెలుగు చూసింది. 10ఏళ్ల దళిత బాలికకు ఘోర అవమానం జరిగింది.
కాలు నొప్పితో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన దళిత బాలికను అక్కడ పని చేస్తున్న నర్సు చేతితో కాకుండా కాలితో తొక్కి పరీక్షించడం గమనార్హం.
బాలిక కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కోనసీమ జిల్లాలోని కాట్రేనికోనకు చెందిన నేలపాటి భాస్కరరావు తన 10ఏళ్ల మనవరాలు శ్రీదేవిని డిసెంబర్ 17న ఉదయం స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు.
ఏపీ
చికిత్స చేయకుండానే అమలాపురం ఆసుపత్రికి సిఫార్సు
కొంతకాలంగా కాలు నొప్పితో బాధపడుతున్న శ్రీదేవిని ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సు మణికుమారి పరీక్షించారు. అయితే బాలిను నర్సు చేతితో కాకుండా కాలితో తొక్కి పరీక్షించారు.
ఆ తర్వాత ఎలాంటి చికిత్స చేయకుండానే శ్రీదేవిని అమలాపురం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని నర్సు సూచించారు.
ఈ క్రమంలో నర్సు మణికుమారి తీరుపై భాస్కరరావు మండిపడ్డారు. ఆసుపత్రికి వచ్చేవారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని హితువుపలికారు.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని భాస్కరరావు హెచ్చరించడంతో భాస్కరరావుకు మణికుమారి క్షమాపణలు చెప్పారు.