Loading...
Andhra Pradesh: అల్పపీడన ప్రభావం.. ఏపీలో నేడు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
అల్పపీడన ప్రభావం.. ఏపీలో నేడు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

Andhra Pradesh: అల్పపీడన ప్రభావం.. ఏపీలో నేడు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు ఆనుకొని కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనికి తోడు కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముందని పేర్కొంది. ఈ వ్యవస్థల ప్రభావంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృత వాతావరణం నెలకొనడంతో పాటు పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వివరాలు 

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.

మిగిలిన జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

అదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ప్రజలు వర్షాలు, పిడుగులు, బలమైన గాలుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ADVERTISEMENT