
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కాలేజీల్లో చదవే విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది నుంచి 10వ తరగతి, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను నగద ప్రోత్సాహం అందించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది.
అంతేకాకుండా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులను ప్రభుత్వం సత్కరించనున్నది.
మే 23న, 27న జిల్లా, 31న రాష్ట్రస్థాయిలో విద్యార్థులను అవార్డులు, నగదను అందజేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఏపీ
ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లను కూడా సన్మానాలు
విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ సన్మాన కార్యక్రమాలు, అవార్డులను అందజేస్తున్నట్లు మంత్రి బోత్స సత్యనారాయణ తెలిపారు.
విద్యార్థులకు అత్యధిక మార్కులు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లను కూడా సన్మానించనున్నటలు ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యాలయాల్లో చదవి విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని నింపేందుకే ఈ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న్టుట్లు చెప్పారు.
ఇంత వరకు అమలు చేసిన వినూత్నమైన, విప్లవాత్మకమైన కార్యక్రమాలకు తోడు ఈ ఏడాది నుంచి పబ్లిక్ పరీక్షల్లో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.