Loading...
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ పోరు.. ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా
ఏపీ మున్సిపల్ పోరు.. ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా

AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ పోరు.. ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లలోని మొత్తం 922 డివిజన్లకు గాను 118 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 804 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా, ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 87 మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలు ఉండగా.. వాటిలో 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 15 స్థానాలను దక్కించుకోగా, జనసేన, బీజేపీ చెరో స్థానంలో విజయం సాధించాయి. మిగిలిన 70 ఛైర్‌పర్సన్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, వాటి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

వివరాలు 

637 వార్డులు ఏకగ్రీవం 

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,020 మున్సిపల్ వార్డుల్లో 637 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన 2,382 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయా వార్డుల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

కౌంటింగ్‌లో ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయం సాధించారు.

పెద్దాపురం మున్సిపాలిటీలోని 3వ వార్డులో జనసేన అభ్యర్థి సతీశ్‌కుమార్‌ 773 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

అలాగే, కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని 7వ వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.

వివరాలు 

ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా

రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

మున్సిపాలిటీ గెలిచిన అభ్యర్థి పార్టీ

పిడుగురాళ్ల షేక్ బాబావలీ టీడీపీ

గురజాల నెలవల్లి బొల్లయ్య టీడీపీ

దాచేపల్లి తంగెళ్ల శ్రీనివాసరావు టీడీపీ

కనిగిరి అచ్చాల తిరుపతమ్మరెడ్డి టీడీపీ

నగరి ఇ. నారాయణ శ్రీనివాసన్ టీడీపీ

పుంగనూరు నయీం తాజ్ టీడీపీ

రాయచోటి బోనుమల ఖాదర్‌వలీ టీడీపీ

రాజంపేట దొంతం గాయత్రి టీడీపీ

ప్రొద్దుటూరు నంద్యాల రాఘవరెడ్డి టీడీపీ

బద్వేలు సోమేశుల దివ్యతేజ టీడీపీ

మైదుకూరు ధనపాల జగన్‌మోహన్ టీడీపీ

కమలాపురం గొంగల్‌రెడ్డి స్వప్న టీడీపీ

ADVERTISEMENT

వివరాలు 

ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా

గుత్తి గోవిందరాజుల తమిళ్‌సెల్వి టీడీపీ

ఆళ్లగడ్డ షేక్ అనీషా టీడీపీ

ఆత్మకూరు డాక్టర్ ఆవుల గోవిందరాజులు టీడీపీ

ఎర్రగుంట్ల గొర్ల మధులత బీజేపీ

దర్శి దారం సుబ్బారావు జనసేన

ADVERTISEMENT