LOADING...
Andhra Pradesh: పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల జోరు.. 42 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు
పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల జోరు.. 42 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు

Andhra Pradesh: పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల జోరు.. 42 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2026
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మరో శుభవార్త అందించారు. తాజాగా 42 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా (డీడీవోలు) పదోన్నతులు పొందేందుకు ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన సీనియారిటీ జాబితాను డిపార్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఆమోదించడంతో, త్వరలోనే వీరంతా ఉన్నత హోదాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 10 వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాయి. గత పదేళ్లతో పోలిస్తే ఈ స్థాయిలో పదోన్నతులు కల్పించడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొంటున్నారు.

వివరాలు 

వర్షాకాలంపై సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు

ప్రమోషన్ల అంశంతో పాటు వర్షాకాల పరిస్థితులపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజతో మాట్లాడిన ఆయన, గ్రామస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు ఆదేశాలు జారీ చేశారు.

వివరాలు 

గ్రామపంచాయతీ ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం

వర్షాకాలంలో నిల్వ నీటి కారణంగా దోమలు విస్తరించే అవకాశం ఉందని, పైపులైన్ల లీకేజీలతో తాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రతి గ్రామపంచాయతీ ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణను మరింత కట్టుదిట్టంగా చేపట్టాలని, అన్ని గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగినంత నిల్వ ఉంచి అవసరమైన ప్రాంతాల్లో వెంటనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement