LOADING...
Rajdhani train: రైల్వే భోజనంలో ఈగ.. క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా
రైల్వే భోజనంలో ఈగ.. క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా

Rajdhani train: రైల్వే భోజనంలో ఈగ.. క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడికి అందించిన వెజ్‌ బిర్యానీలో ఈగ కనిపించిన ఘటనపై ఐఆర్‌సీటీసీ కఠిన చర్యలు చేపట్టింది. భోజనం సరఫరా చేసిన క్యాటరింగ్ సంస్థపై రూ.లక్ష జరిమానా విధించడంతో పాటు, ఆహారశాల లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మంగళవారం అహ్మదాబాద్‌-ముంబయి తేజస్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వెజ్‌ బిర్యానీని ఆర్డర్‌ చేశారు. భోజనం చేస్తున్న సమయంలో బిర్యానీలో ఈగ కనిపించడంతో వెంటనే ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేశారు.

వివరాలు 

షోకాజ్ నోటీసు జారీ

ఫిర్యాదు అందుకున్న వెంటనే రైలు కెప్టెన్‌, క్యాటరింగ్ విభాగం మేనేజర్‌ ప్రయాణికుడిని కలిసి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బంది క్షమాపణలు చెబుతూ మరో భోజనం అందిస్తామని సూచించారు. అయితే, ప్రయాణికుడు ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐఆర్‌సీటీసీ, సూరత్‌లోని తమ ప్రధాన వంటశాల నుంచి భోజనాలను సరఫరా చేసిన అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ క్యాటరింగ్ సంస్థపై రూ.లక్ష జరిమానా విధించింది. అలాగే ఆహార నాణ్యతలో నిర్లక్ష్యంపై వివరణ కోరుతూ, లైసెన్స్ రద్దు చర్యలు ఎందుకు తీసుకోకూడదో పేర్కొంటూ షోకాజ్ నోటీసును జారీ చేసింది.

Advertisement