పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్
కూరగాయల పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఘనత సాధించింది. దేశంలోనే 5వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. వాస్తవానికి 2011-12లో పండ్లు, కూరగాయల దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ వాటా 5.8శాతంగా ఉండేది. అది 2020-21 నాటికి 8.3శాతానికి చేరినట్లు కేంద్ర గణాంక శాఖ పేర్కొది. ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో పండ్లు, కూరగాయల వృద్ధి గణనీయంగా పెరిగినట్లు కేంద్రం చెప్పింది. అందుకే పదేళ్ల క్రితం ఏడోస్థానంలో ఉన్న ఏపీ, ఇప్పుడు 5వ స్థానానికి చేరుకున్నట్లు పేర్కొంది.
చేపల ఉత్పత్తిలో 2016 నుంచి ఏపీ నంబర్ వన్
కూరగాయల పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కంటే ముందు బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల స్థూల విలువ 2011-12లో 16వేల 5వందల కోట్ల రూపాయలు కాగా, 2020-21 నాటికి అది 32వేల 9వందల కోట్ల రూపాయాలకు చేరుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రశువుల ఉత్పత్తిలో కూడా మెరుగైన స్థితిలోనే ఉంది. 7.9శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉన్నట్లు కేంద్ర గణాంక శాఖ పేర్కొది. ఇక చేపల ఉత్పత్తి విషయాని వస్తే 2016 నుంచి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది.