Page Loader
Andhra Pradesh: వడగాలుల ధాటికి ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి.. 150 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
వడగాలుల ధాటికి ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి.. 150 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Andhra Pradesh: వడగాలుల ధాటికి ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి.. 150 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2025
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

వడగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సగటున 40 డిగ్రీల సెల్సియస్‌కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా పతిపడుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 150కు పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటి వేడి చురుగ్గా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో కొమరోలు, నంద్యాల, కమలాపురంలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎస్ కోట, అనకాపల్లి, అన్నమయ్య జిల్లా రుద్రవరంలో 42 డిగ్రీల మేర వేడి నమోదైంది.

Details

రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు

కర్నూలు జిల్లాలో కొసిగి, శ్రీకాకుళం జిల్లాలో మిళియాపుట్టు, సత్యసాయి జిల్లాలో తాడిమర్రి, సబ్బవరం, వీరఘట్టంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో గుంతకల్లు, తూర్పుగోదావరి జిల్లాలో గోపాలపురం, తిరుపతి, నెల్లూరులో 40 డిగ్రీలు నమోదయ్యాయి. చిత్తూరు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నరసరావుపేట, ఏలూరు తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీల వద్ద ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.