NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Breaking: ఆంధ్రప్రదేశ్ లో కుల గణన వాయిదా 
    తదుపరి వార్తా కథనం
    Breaking: ఆంధ్రప్రదేశ్ లో కుల గణన వాయిదా 
    Breaking: ఆంధ్రప్రదేశ్ లో గుల గణన వాయిదా

    Breaking: ఆంధ్రప్రదేశ్ లో కుల గణన వాయిదా 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 24, 2023
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణనపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఒక రోజైన పూర్తి కాకముందే వాయిదా పడింది.

    జగన్ ప్రభుత్వం కుల గణనకు సంబంధించి ఈనెల 27 నుంచి ప్రారంభించేందుకు కసరత్తులను పూర్తి చేసింది. సర్వేను డిసెంబర్ 3 నాటికి పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకుఆదేశాలు కూడా ఇచ్చింది.

    కానీ,ఇప్పుడు ఈ నిర్ణయం వాయిదా వేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

    ఈ నేపథ్యంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ.. కులగణనపై నాలుగు ప్రాంతాల్లో రౌండు టేబుల్‌ సమావేశాలు పెడుతున్నందున వాయిదా వేసినట్లు తెలిపారు.

    డిసెంబర్‌ 10 నుంచి కుల గణన చేస్తామన్న ఆయన క్రింది స్థాయి నుండి అందరి సూచనలు తెలుసుకుంటున్నందుకు కులగణన మరో 10రోజులు ఆలస్యం అవుతుందన్నారు.

    Details 

    ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు అదే మొబైల్ వాడాలని సూచనలు 

    సర్వేలో వాలంటీర్లు,గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 20కిపైగా అంశాలపై సమాచారం తీసుకోనున్నారు.

    కుల గణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్ ఫోన్లలో ప్రత్యేక యాప్'ను సైతం రూపొందించారు.

    సర్వేలో భాగంగా చిరునామా, కుటుంబీకుల సంఖ్య, వివాహం జరిగిందా, కులం, ఉపకులం, మతం, విద్యార్హత, రేషన్‌ కార్డు నెంబర్‌, నివాస స్థల విస్తీర్ణం, ఇంటి రకం, పశువుల సంఖ్య, వ్యవసాయ భూమి విస్తీర్ణం, మరుగుదొడ్డి రకం, వంట గ్యాస్‌, తాగునీటి సదుపాయం తదితర అంశాలపై సమాచారం సేకరించనున్నారు.

    ఇదే సమయంలో సర్వే ప్రక్రియ ప్రారంభం నాటి నుంచి ముగింపు వరకు వాలంటీర్లు ఒకే మొబైల్ వినియోగించాలనే సూచనలున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    ఆంధ్రప్రదేశ్

    Dussehra holidays: ఏపీలో దసరా సెలవుల్లో కీలక మార్పులు రాష్ట్రం
    AP Rains : బంగాళాఖాతంలో తుఫాన్.. ఇక ఏపీలో వానలే వానలు! బంగాళాఖాతం
    Janasena Cm : సీఎం పదవిపై పవణ్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారో తెలుసా పవన్ కళ్యాణ్
    బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న హమూన్ తుఫాను ముప్పు.. ఉత్తరాంధ్ర పై ప్ర‌భావం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025