
స్వదేశీ ఎల్‌సీఏ ఫైటర్ జెట్‌లలో 'అంగద్', 'ఉత్తమ్'ను అమర్చేందుకు రక్షణ శాఖ ప్లాన్
ఈ వార్తాకథనం ఏంటి
మేకిన్ ఇండియాలో భాగంగా మిలిటరీ ఆయుధ వ్యవస్థల స్వదేశీకరణపై రక్షణ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ మేరకు ఇప్పటికే ఆవిష్కరణలు చేసిన రక్షణ శాఖ.. తాజాగా మరో కీలక పరిణామానికి నాంది పలికింది.
దేశీయంగా భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం ఎల్‌సీఏ తేజస్ మార్క్1లో ఇటీవల అభివృద్ధి చేసిన సరికొత్త స్వదేశీ పరికరాలను అమర్చేందుకు రక్షణ శాఖ సిద్ధమవుతోంది.
దేశీయంగా అభివృద్ధి చేసిన రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అమర్చే కార్యక్రమం వీలైనంత త్వరలో ప్రారంభం అవుతుందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నారు.
ఇప్పటికే ఎల్‌సీఏ తేజస్ మార్క్1 యుద్ధ విమానాలు సేవలను అందిస్తున్నాయి. వీటికి రాడార్, వార్ఫేర్ సూట్ అమర్చితే మరింత శక్తమంతంగా పనిచేస్తాయని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
త్వరలో యుద్ధ విమానాల్లో పరికరాలను అమర్చనున్న రక్షణ శాఖ
3/5
— The Daily Journal Newsletter (@TDJ_in) October 16, 2023
Angad’, ‘Uttam’ to replace imported systems in indigenous #LCA fighter jets pic.twitter.com/IK8W4AkXPk