Page Loader
Parliament: పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం.. గోడ దూకిన యువకుడు
పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం.. గోడ దూకిన యువకుడు

Parliament: పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం.. గోడ దూకిన యువకుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2024
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం కనిపించింది. ఓ యువకుడు పార్లమెంట్ గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ 20ఏళ్ల యువకుడు, ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపున గోడ దూకి పార్లమెంట్ అనెక్స్ భవనం పరిసరాల్లోకి ప్రవేశించగా, సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి వద్ద ఎలాంటి మరణాయుధాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత అతడిని దిల్లీ పోలీసులకు అప్పగించారు.

Details

దర్యాప్తు చేపట్టిన పోలీసులు

నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌కు యెందిన మనీశ్‌గా పోలీసులు నిర్ధారించారు. అంత ఎత్తున ఉన్న గోడ ఎలా ఎక్కాడు? ఎందుకు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు అన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే మనీశ్ మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమికంగా గుర్తించారు. గతేడాది కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశ వేళ లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన తర్వాత పార్లమెంట్‌లో భద్రతను మరింత పెంచారు.