Loading...
CII Partnership Summit 2026: సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026కు ప్రభుత్వం కమిటీలు.. ప్రాంతీయ సదస్సుల షెడ్యూల్ ఖరారు
ప్రాంతీయ సదస్సుల షెడ్యూల్ ఖరారు

CII Partnership Summit 2026: సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026కు ప్రభుత్వం కమిటీలు.. ప్రాంతీయ సదస్సుల షెడ్యూల్ ఖరారు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలో ఈ ఏడాది నవంబరు 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 ఏర్పాట్లను వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సదస్సు నిర్వహణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ప్రాంతీయ సదస్సులను సమర్థంగా నిర్వహించేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఐదు ప్రాంతాల్లో నిర్వహించనున్న ప్రాంతీయ సదస్సుల ప్రాథమిక షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు మొత్తం ఏడు ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ప్రకటించింది.

వివరాలు 

మంత్రివర్గ ఉపసంఘం

మంత్రి నారా లోకేశ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, పొంగూరు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారు.

ప్రొటోకాల్, రిసెప్షన్, వసతి, లాజిస్టిక్స్ కమిటీ

సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, సీఐఐ ప్రతినిధులతో కలిపి మొత్తం 10 మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు.

సెక్యూరిటీ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కమిటీ

అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ఛైర్మన్‌గా, విశాఖపట్నం పోలీసు కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వివిధ శాఖలకు చెందిన ఐదుగురు అధికారులు సభ్యులుగా ఉంటారు.

వివరాలు 

సిటీ బ్యూటిఫికేషన్ కమిటీ

మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఉంటారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వివిధ శాఖలకు చెందిన ఎనిమిది మంది అధికారులు సభ్యులుగా నియమితులయ్యారు.

సాంస్కృతిక కమిటీ

పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా, ఏపీ ఈడీబీ (APEDB) సీఈవో కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. మరో ఐదుగురు అధికారులు సభ్యులుగా ఉంటారు.

మీడియా, పబ్లిసిటీ కమిటీ

ప్రజా పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. వివిధ శాఖలకు చెందిన తొమ్మిది మంది అధికారులు సభ్యులుగా ఉంటారు.

ఆర్గనైజింగ్ కమిటీ

పరిశ్రమల శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. వివిధ శాఖలకు చెందిన తొమ్మిది మంది ఉన్నతాధికారులు సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రాంతీయ సదస్సులకు ప్రత్యేక కమిటీలు

సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్న ప్రాంతీయ సదస్సులను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.

పరిశ్రమల శాఖ కార్యదర్శి కమిటీ ఛైర్మన్‌గా ఉండగా, ఆయా జిల్లాల కలెక్టర్లు మెంబర్-కన్వీనర్లుగా వ్యవహరిస్తారు.

ప్రాంతీయ సదస్సుల నిర్వహణకు సంబంధించి ప్రాథమిక తేదీలు, వేదికలను ప్రభుత్వం నిర్ణయించింది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రాంతీయ సదస్సుల నిర్వహణ

అక్టోబర్ 7, 2027 - విశాఖపట్నంలోని ఐఐఎం క్యాంపస్

అక్టోబర్ 12 - కాకినాడ జేఎన్‌టీయూ

అక్టోబర్ 16 - అమరావతి అంబేడ్కర్ ఆడిటోరియం

అక్టోబర్ 23 - అనంతపురం జేఎన్‌టీయూ

అక్టోబర్ 26 - తిరుపతి శ్రీసిటీలోని క్రియా విశ్వవిద్యాలయం

ఈ ప్రాంతీయ సదస్సుల ద్వారా పరిశ్రమలు, పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలపై విస్తృత చర్చలు నిర్వహించి, నవంబరులో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సును మరింత విజయవంతంగా నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.

ADVERTISEMENT