Loading...
Panchadarla: పంచదార్ల కొండకు రక్షణ.. 2.153 హెక్టార్లలో నో మైనింగ్‌ జోన్
పంచదార్ల కొండకు రక్షణ.. 2.153 హెక్టార్లలో నో మైనింగ్‌ జోన్

Panchadarla: పంచదార్ల కొండకు రక్షణ.. 2.153 హెక్టార్లలో నో మైనింగ్‌ జోన్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండల పరిధిలో ఉన్న పంచదార్ల కొండను ఏపీ ప్రభుత్వం నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించింది. కొండ పరిధిలోని 2.153 హెక్టార్ల భూమిని మైనింగ్‌ కార్యకలాపాలకు అనుమతి లేని ప్రాంతంగా గుర్తిస్తూ గనుల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్ల కొండపై ఉన్న పురాతన ఆలయంతో పాటు అక్కడి ప్రకృతి వనరులను కాపాడేందుకు నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించాలని ప్రభుత్వం గతంలో రెవెన్యూ, మైనింగ్‌ శాఖలను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సంబంధిత శాఖలు చర్యలు చేపట్టగా.. తాజాగా 2.153 హెక్టార్ల విస్తీర్ణాన్ని నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటిస్తూ గనుల శాఖ అధికారికంగా ఉత్తర్వులు వెలువరించింది.

ADVERTISEMENT