Loading...
AP High Court: పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

AP High Court: పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
08:05 am

ఈ వార్తాకథనం ఏంటి

పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కౌంటింగ్‌ నిలిపివేయాలంటూ వైకాపా ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీల,ఆ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. దీంతో పులివెందులలో ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమమైంది.రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇప్పటికే నాలుగు వార్డుల్లో రీపోలింగ్‌ నిర్వహించింది. అయితే,ఆ నాలుగు వార్డులకే పరిమితం కాకుండా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని మిగతా అన్ని వార్డుల్లోనూ మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని ప్రమీల,అవినాష్‌రెడ్డి తమ పిటిషన్లలో కోరారు. అప్పటివరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం మంగళవారం ఉదయం 7.30 గంటలకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. పిటిషన్లను కొట్టివేస్తూ కౌంటింగ్‌కు అనుమతి ఇచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పులివెందుల కౌంటింగ్... వైసీపీకి షాక్

ADVERTISEMENT