Page Loader
Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి షాక్.. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు 
వల్లభనేని వంశీకి షాక్.. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి షాక్.. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ ఎదురైంది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ-71 నిందితుడిగా ఉన్న వంశీ, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, బెయిల్ మంజూరు చేయడం సాధ్యపడదని స్పష్టం చేస్తూ, పిటిషన్‌ను కొట్టివేసింది.

వివరాలు 

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచన

ఈ మేరకు, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. అంతకుముందు, దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, మంగళవారం జైలులో వంశీని ములాఖత్ సమయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు జగన్ వంశీతో చర్చించారు. జగన్ వెంట వంశీ భార్య పంకజశ్రీ, సింహాద్రి రమేష్ కూడా జైలు లోపలికి వెళ్లారు.