Page Loader
AP ICET-2023: రేపు ఏపీ ఐసెట్: నిమిషం ఆలస్యమైనా అనుమతించరు 
AP ICET-2023: రేపు ఏపీ ఐసెట్: నిమిషం ఆలస్యమైనా అనుమతించరు

AP ICET-2023: రేపు ఏపీ ఐసెట్: నిమిషం ఆలస్యమైనా అనుమతించరు 

వ్రాసిన వారు Stalin
May 23, 2023
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2023(ఏపీ ఐసెట్-2023)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్ఈ) ఆధర్వంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బుధవారం నిర్వహించనుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తోంది. రెండు విడతల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9గంటలకు, మధ్యాహ్నం 3గంటలకు పరీక్షలను షెడ్యూల్ చేశారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో 109, తెలంగాణలో 2చోట్ల పరీక్షా కేంద్రాలను నిర్వహించనున్నారు.

ఏపీ

ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్ లైన్ సెంటర్‌కు ఫిర్యాదు చేయండి: ఎస్కేయూ వీసీ 

పరీక్షలకు సంబంధించి అభ్యర్థులను నిబంధనలను తప్పుకుండా పాటించాలని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ పరీక్ష కోసం మొత్తం 49,162 మంది దరఖాస్తున్న చేసుకున్నారని, హాల్ టికెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్ లైన్ సెంటర్‌కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.