Page Loader
inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి!
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి!

inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఇంటర్ మొదటి సంవత్సరం (ప్రథమ సంవత్సరం) సప్లిమెంటరీ పరీక్షలకు 1,35,826 మంది విద్యార్థులు హాజరవ్వగా, రెండో సంవత్సరం (ద్వితీయ సంవత్సరం) పరీక్షలకు 97,963 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సప్లిమెంటరీ ఫలితాలను విద్యార్థులు https://resultsbie.ap.gov.in/](https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా గానీ, లేక మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా గానీ తెలుసుకోవచ్చు.

Details

ఫలితాలను వెబ్‌సైట్‌ ద్వారా ఇలా చూసుకోవచ్చు

1. అధికారిక వెబ్‌సైట్ అయిన [https://resultsbie.ap.gov.in/](https://resultsbie.ap.gov.in/) ఓపెన్ చేయాలి. 2. అక్కడ మీరు ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్, ఫస్ట్ ఇయర్ ఓకేషనల్ రిజల్ట్స్, సెకండియర్ జనరల్ రిజల్ట్స్, సెకండియర్ ఓకేషనల్ రిజల్ట్స్ అనే నాలుగు విభాగాలను చూడవచ్చు. 3. మీకు సంబంధించిన విభాగాన్ని ఎంపిక చేసుకుని దానిపై క్లిక్ చేయాలి. 4. తదుపరి పేజీలో మీ హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేసి, గెట్ రిజల్ట్స్ బటన్‌ను క్లిక్ చేయాలి. 5. వెంటనే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థులు తాము పొందిన మార్కులు, పాస్/ఫెయిల్ స్టేటస్‌ తదితర వివరాలను తెలుసుకోగలరు.