Crop Insurance in AP: ఖరీఫ్,రబీ పంటల బీమా అమలు.. రైతులకు కీలక మార్గదర్శకాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)తో పాటు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు సాగు చేసిన పంటలకు అనుగుణంగా తమ వాటా ప్రీమియం చెల్లిస్తేనే బీమా సౌకర్యం వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ప్రీమియంను భరిస్తాయి. ఈ రెండు పథకాల అమలుకు సంబంధించి జిల్లాల వారీగా బీమా సంస్థలు, నోటిఫై చేసిన పంటలు, నమోదు గడువులు తదితర అంశాలపై ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసింది.
వివరాలు
రైతు గుర్తింపు సంఖ్యపై కేంద్ర సూచన
పంటల బీమా పథకంలో నమోదు కోసం రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య (Farmer Unique ID) ఆధారంగా నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే దీనికి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా, ఇప్పటివరకు తుది ఆదేశాలు వెలువడలేదు. కేంద్రం అనుమతి ఇస్తే రైతులు గుర్తింపు సంఖ్య లేకుండానే బీమా పథకంలో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. పంటల బీమా పథకంలో చేరాలా లేదా అనేది పూర్తిగా రైతుల స్వచ్ఛంద నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
వివరాలు
పంట రుణాలు తీసుకున్న రైతులకు ప్రత్యేక విధానం
పంట రుణాలు పొందిన రైతులకు బీమా అమలయ్యేలా వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల ద్వారా ఇచ్చే పంట రుణాల నుంచి సాగు చేస్తున్న పంటకు అనుగుణంగా ప్రీమియం మొత్తాన్ని వసూలు చేస్తారు. అయితే బీమా అవసరం లేదని రైతు లిఖితపూర్వకంగా తెలియజేస్తే బ్యాంకులు ప్రీమియంను మినహాయిస్తాయి. రాష్ట్రంలోని పాత 26 జిల్లాల ప్రాతిపదికన పీఎంఎఫ్‌బీవై అమలు చేయనున్నారు. రైతులు నమోదు చేసిన పంటల వివరాలను 'ఈ-పంట' (e-Crop) నమోదు ఆధారంగా ధ్రువీకరిస్తారు.
వివరాలు
ఖరీఫ్ సీజన్‌లో నమోదు గడువులు
పీఎంఎఫ్‌బీవై: వరి పంటకు: ఆగస్టు 15 వరకు ఇతర నోటిఫై చేసిన అన్ని పంటలకు: జులై 31 వరకు సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకం నోటిఫై చేసిన అన్ని పంటలకు: జులై 15లోగా నమోదు చేసుకోవాలి. రబీ సీజన్‌లో నమోదు గడువులు పీఎంఎఫ్‌బీవై వరి పంటకు: డిసెంబర్ 31 వరకు ఇతర నోటిఫై చేసిన అన్ని పంటలకు: డిసెంబర్ 15 వరకు సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకం జీడిమామిడి పంటకు: నవంబర్ 15 వరకు టమాటా పంటకు: డిసెంబర్ 15లోగా నమోదు చేసుకోవాలి.
వివరాలు
పీఎంఎఫ్‌బీవై అమలు చేసే బీమా సంస్థలు - జిల్లాల వారీగా
జనెరాలి సెంట్రల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనంతపురం, తిరుపతి, నంద్యాల, విశాఖపట్నం, గుంటూరు, శ్రీకాకుళం, పల్నాడు, వైఎస్సార్ కడప జిల్లాలు. టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కృష్ణా, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, బాపట్ల జిల్లాలు. ఐసీఐసీఐ లాంబార్డ్ ప్రకాశం, అన్నమయ్య, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలు. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ పశ్చిమగోదావరి, శ్రీసత్యసాయి, విజయనగరం జిల్లాలు.
వివరాలు
సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకం అమలు సంస్థలు
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అనంతపురం, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, నంద్యాల, బాపట్ల, అనకాపల్లి, ప్రకాశం, ఏలూరు జిల్లాలు. ఇండస్‌లాండ్ ఇన్సూరెన్స్ కర్నూలు జిల్లా. ఇఫ్‌కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్టీఆర్, గుంటూరు, కాకినాడ, వైఎస్సార్ కడప, అన్నమయ్య, విజయనగరం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, తిరుపతి, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లాలు.