AP LAWCET 2026 Results: ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణులైన 80శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ న్యాయ ప్రవేశ పరీక్షలు ఏపీ లాసెట్-2026, పీజీఎల్‌సెట్-2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం విడుదల చేశారు. మే 4న నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 23,996 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 19,197 మంది అర్హత సాధించి సుమారు 80 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి: https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_GetResult.aspx
వివరాలు
విద్యార్థులందరికీ మంత్రి అభినందనలు
పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. ఈసారి లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం చేపట్టింది. విద్యార్థులు తమ నమోదు సంఖ్య, ప్రవేశ పత్రం సంఖ్య, జనన తేదీ వివరాలను నమోదు చేసి మార్కుల పత్రాలను పొందవచ్చని అధికారులు సూచించారు. ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి: https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_GetResult.aspx