
AP Metro Train:ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు.. విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై ఒక కీలక ముందడుగు పడింది.
ఈ నేపథ్యంలో మెట్రో రైలు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి పలు అంతర్జాతీయ బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేసే బ్యాంకులతో ఆయన కీలక చర్చలు నిర్వహించారు.
ఈ భేటీలో కేఎఫ్‌డబ్ల్యూ (KfW), ఏఎఫ్‌డీ (AFD), ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB), ఏఐఐబీ (AIIB), జైకా (JICA), ప్రపంచ బ్యాంకు (World Bank) వంటి ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
వివరాలు
విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు
వీరు విజయవాడలో ప్రతిపాదించబడిన మెట్రో కారిడార్లను ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రాజెక్టుల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు.
అనంతరం నిర్వహించిన చర్చలలో భాగంగా, విశాఖపట్టణం మెట్రో ప్రాజెక్టుకు రూ.6,100 కోట్ల మేర రుణాన్ని, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు రూ.5,900 కోట్ల మేర రుణాన్ని సమీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నట్లు సమాచారం అందుతోంది.