Loading...
AP Municipal Election: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. మొదలైన ఓట్ల లెక్కింపు
ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. మొదలైన ఓట్ల లెక్కింపు

AP Municipal Election: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. మొదలైన ఓట్ల లెక్కింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఓట్లను లెక్కిస్తున్నారు. మేయర్‌, ఛైర్‌పర్సన్‌ పీఠాల కోసం పోటీ చేసిన 520 మంది అభ్యర్థులతో పాటు కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా బరిలో నిలిచిన 10,105 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఫలితాలు తేల్చనున్నాయి. మొత్తం 60 లక్షల మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు నేడు వెల్లడికానుంది. రాత్రి 8 గంటల్లోగా ఫలితాలను ప్రకటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 13 మేయర్‌ స్థానాలకు గాను కూటమి తరఫున తెదేపా 10 చోట్ల, జనసేన రెండు స్థానాల్లో, భాజపా ఒకచోట పోటీ చేశాయి.

వివరాలు 

ఓట్ల లెక్కింపు ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి

వైకాపా మొత్తం 13 స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించింది. 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోని ఛైర్‌పర్సన్‌ స్థానాలకు గాను 17 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మిగిలిన 70 స్థానాల్లో తెదేపా 49 చోట్ల, జనసేన 17 చోట్ల, భాజపా నాలుగు చోట్ల పోటీ చేస్తున్నాయి. వైకాపా కూడా ఈ 70 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది.

కూటమి ప్రభుత్వం తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే విజయాన్ని అందిస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది.

మరోవైపు, కొన్ని స్థానాల్లోనైనా గట్టి పోటీ ఇస్తామని వైకాపా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

వివరాలు 

ఓట్ల లెక్కింపు ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి

డివిజన్లు, వార్డుల వారీగా వచ్చిన ఓట్ల ఆధారంగా బ్యాలట్‌ పత్రాలను కట్టలుగా కట్టేందుకు గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో మొత్తం 47,817 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొంటున్నారు.

ADVERTISEMENT