
AP News: గాజువాకలో ఆకాష్ బైజూస్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్నంలోని గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం సంభవించింది.
అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. ఉదయం నుంచి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదం వల్ల కాంప్లెక్స్‌లో మూడు ఫ్లోర్లు దగ్ధమయ్యాయి. ఫలితంగా భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.
కాంప్లెక్స్‌లో వెనుక భాగానికి కూడా మంటలు వ్యాపించడంతో అక్కడ నివాసముండే ప్రజలు భయపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎగిసిపడుతున్న మంటలు
విశాఖ గాజువాక లోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో భారీ అగ్నిప్రమాదం. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక శకటాలు.#AndhraPradesh #Vizag #Visakhapatnam #Byjus pic.twitter.com/aTHB9nXtlX
— Vizag News Man (@VizagNewsman) February 27, 2024