Loading...
AP Panchayat Elections: ఏపీ ఎన్నికల చిత్రం... ఒకవైపు ఎన్నికలు...మరోవైపు ఘర్షణలు
ఏపీ ఎన్నికల చిత్రం... ఒకవైపు ఎన్నికలు...మరోవైపు ఘర్షణలు

AP Panchayat Elections: ఏపీ ఎన్నికల చిత్రం... ఒకవైపు ఎన్నికలు...మరోవైపు ఘర్షణలు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 29, 2026
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృష్ణా జిల్లాలోని పామర్రు జడ్పీ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల పరిధిలోకి ఇరువర్గాల వారు రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. 13వ బూత్‌లో ఓటు వేసే విషయంలో వివాదం తలెత్తి టీడీపీ ఏజెంట్‌పై దాడి జరిగినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను బయటకు పంపించారు. నంద్యాల జిల్లా పెట్నికోటలోనూ రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.

Details

ఓటు విషయంలో వివాదాలు.. పది మందికి గాయాలు

ఎన్టీఆర్‌ జిల్లా మాగల్లులో వృద్ధుల ఓటు విషయంలో ఇరుపార్టీల మధ్య వివాదం తలెత్తింది.

కృష్ణా జిల్లా పెనమలూరులో ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిని దొంగ ఓటు వేస్తున్నాడంటూ అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.

అనంతపురం జిల్లా యల్లనూరు పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ ఏజెంట్లపై దాడి జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనలో 10 మంది గాయపడగా, పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా వన్నెపూడిలో ఓ మహిళ బ్యాలెట్‌ పత్రాలను చించివేసింది.

తిరుపతి జిల్లా శ్రీరామపురంలోనూ ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి, వైసీపీ నేత భానుకుమార్‌రెడ్డిని అరెస్టు చేశారు.

Details

13 కిలోమీటర్లు నడిచి వచ్చి ఓటు

ఘర్షణల మధ్య అల్లూరి జిల్లాలోని గిరిజన ఓటర్లు అందరి దృష్టినీ ఆకర్షించారు.

అనంతగిరి మండలంలోని రొంపిల్లి, బూరిగ, చిన్నకోనేల గ్రామాల నుంచి సుమారు 120 మంది ఓటర్లు 13 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు.

తమ గ్రామాలకు ఇప్పటికీ రహదారి సౌకర్యం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్లు వేయాలని, తమ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చి భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఓటు హక్కును వినియోగించుకుంటూనే తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేశారు.

ADVERTISEMENT