AP SIR: ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో నోటీసుల విచారణ దాదాపు పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 44.27 లక్షల నోటీసులపై విచారణ పూర్తయినట్లు సీఈవో కార్యాలయం వెల్లడించింది. మొత్తం నోటీసుల్లో 99.96 శాతం విచారణ పూర్తికాగా.. ఇంకా 1,665 నోటీసులపై విచారణ చేపట్టాల్సి ఉందని తెలిపింది. తిరుపతిలో అత్యధికంగా 1,554 నోటీసుల విచారణ పెండింగ్‌లో ఉంది. ప్రకాశంలో 48, అనంతపురంలో 43, ఎన్టీఆర్ జిల్లాలో 11, కృష్ణాలో 8, గుంటూరులో ఒక నోటీసు చొప్పున విచారణ పూర్తికావాల్సి ఉందని సీఈవో కార్యాలయం పేర్కొంది. గుంటూరు, ఏలూరు, నంద్యాల, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో నోటీసుల విచారణ స్వల్పంగా పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది.
వివరాలు
ఫొటో వెరిఫికేషన్‌లోనూ పురోగతి
రాష్ట్రంలో మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్లకు సంబంధించి 3.70 కోట్ల ఫొటోలను బీఎల్‌వోలు ఆమోదించినట్లు సీఈవో కార్యాలయం తెలిపింది.
ఫొటో క్వాలిటీ చెక్‌లో 40 వేల మంది ఓటర్లకు సంబంధించిన ఫొటోలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది.
ఇది మొత్తం ఓటర్లలో 0.11 శాతం మాత్రమేనని పేర్కొంది. ఫొటో క్వాలిటీ చెక్‌లో అనంతపురం, నెల్లూరు, తిరుపతి, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో మరింత పురోగతి నమోదైనట్లు సీఈవో కార్యాలయం తెలిపింది.
వివరాలు
వివిధ ఫారాల దరఖాస్తులు పెండింగ్
ఫారం-6 దరఖాస్తుల్లో మొత్తం 69,184 పెండింగ్‌లో ఉన్నట్లు సీఈవో కార్యాలయం వెల్లడించింది.
వీటిలో తిరుపతిలో 12,566, నెల్లూరులో 8,799, వైఎస్సార్ జిల్లాలో 7,824, ప్రకాశంలో 6,329, సత్యసాయి జిల్లాలో 4,844 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
అలాగే ఫారం-6A దరఖాస్తులు 813, ఫారం-7 దరఖాస్తులు 8,478, ఫారం-8 దరఖాస్తులు 31,693 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది.
వివరాలు
క్లెయిమ్స్, అభ్యంతరాల్లో పురోగతి
సోమవారం ఒక్కరోజే క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ ప్రక్రియలో 17,413 పురోగతి నమోదైనట్లు సీఈవో కార్యాలయం పేర్కొంది.
బీఎల్‌వోతో కాల్ బుక్ చేసుకునే సేవలో మొత్తం 258 అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.
వీటిలో 48 గంటలు దాటిన బీఎల్‌వో కాల్ అభ్యర్థనలు 80 ఉన్నట్లు వెల్లడించింది.
బీఎల్‌వోల వద్ద ఫొటో క్వాలిటీ చెక్ కోసం 40,927 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సీఈవో కార్యాలయం తెలిపింది.
ఈఆర్‌వోల వద్ద ఇదే ప్రక్రియకు సంబంధించి 4.52 లక్షల ఫొటోలు క్వాలిటీ చెక్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది.