LOADING...
AP SSC Results 2026: నేడే ఏపీ 'పది' ఫలితాలు. ఇలా చెక్‌ చేయండి..
నేడే ఏపీ 'పది' ఫలితాలు. ఇలా చెక్‌ చేయండి..

AP SSC Results 2026: నేడే ఏపీ 'పది' ఫలితాలు. ఇలా చెక్‌ చేయండి..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు నిర్ణీత సమయానికి అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా తెలుసుకునేందుకు పలు మార్గాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. SSC ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. అలాగే 'మన మిత్ర' సేవలో 9552300009 సంఖ్యకు "hi" అని సందేశం పంపడం ద్వారా ఫలితాలు పొందే అవకాశం ఉంది.

వివరాలు 

విద్యార్థులకు నారా లోకేష్ శుభాకాంక్షలు

అదనంగా LEAP మొబైల్ యాప్ ద్వారా కూడా ఫలితాలను చూసుకోవచ్చు. డిజిలాకర్ యాప్, వెబ్‌సైట్‌లో కూడా మార్కుల జాబితాలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ఇక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ తమ పాఠశాల ప్రవేశ వివరాల ద్వారా ఫలితాలను విడుదలైన వెంటనే పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్యాలను సాధించిన వారికి అభినందనలు తెలియజేస్తూ, ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరుత్సాహానికి లోనుకావద్దని సూచించారు. ఇది జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ మాత్రమేనని, ధైర్యంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement