KRMB: ఏపీ-తెలంగాణ మధ్య పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు : కృష్ణా బోర్డు
ఈ వార్తాకథనం ఏంటి
కృష్ణానదీ యాజమాన్య బోర్డు 19వ సర్వసభ్య సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాత ఒప్పందం ప్రకారం వచ్చే నీటి సంవత్సరంలోనూ నీటి పంపకాలు కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది.
తెలంగాణ ప్రతిపాదించినట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో నీటిమీటర్ల (టెలిమీటర్ల) ఏర్పాటు ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది. ఈ అంశంపై కమిటీ ఏర్పాటుకూ ఏపీ అనుమతి ఇవ్వలేదు.
కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు బోర్డు అంగీకారం తెలిపింది.
సమావేశంలో నీటి పంపకాలపై తీవ్ర చర్చ జరిగింది. అందుబాటులో ఉన్న నీటిని 50:50 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా విజ్ఞప్తి చేశారు.
Details
66:34 నిష్పత్తిలోనే నీటి పంపకాలు
అయితే ప్రస్తుత 66:34 నిష్పత్తిలోనే పంపకాలు జరగాలని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం. వెంకటేశ్వరరావు వాదించారు. ప్రాజెక్టులకు సంబంధించిన ట్రైబ్యునల్ నీటి పంపకాలు ఇప్పటికే పూర్తిచేసిందని, ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు నీళ్లు తగ్గించుకోగలమని ప్రశ్నించారు.
ట్రైబ్యునల్ తీర్పు వెలువడే వరకు పాత ఒప్పందం ప్రకారం పంపకాలు కొనసాగించాలని (ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు) బోర్డు నిర్ణయించింది.
ఈ పంపకాలను త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. ఇక తెలంగాణ అధికారులు ఏపీలో నీటి వాడకాన్ని నియంత్రించేందుకు టెలిమీటర్ల ఏర్పాటును ప్రతిపాదించారు.
బొల్లాపల్లి, హంద్రీనీవా కాలువలు వంటి ప్రదేశాల్లో నీటిమీటర్లు ఏర్పాటుకు సిద్ధమని, అవసరమైతే ఖర్చు కూడా భరిస్తామని పేర్కొన్నారు.
Details
నీటి మీటర్లు అవసరం లేదు
కానీ ఈ ప్రతిపాదనను ఏపీ త్రోసిపుచ్చింది. మా నీటిని మేమే ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇందుకు నీటిమీటర్లు అవసరం లేదని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించినా, ఏపీ ఇందుకు అంగీకరించలేదు. విజయవాడలో 17,000 చదరపు అడుగుల స్థలం కేటాయిస్తే, బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అక్కడికి తరలించేందుకు బోర్డు అంగీకారం తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ అధికారులు తెలిపారు.
Details
సీఆర్‌పీఎఫ్ బృందాలపై చర్చ
నాగార్జునసాగర్ కుడి వైపున సీఆర్‌పీఎఫ్‌ను తొలగించాలని, లేదా రెండు వైపులా సీఆర్‌పీఎఫ్ బృందాలను ఏర్పాటు చేయాలని ఏపీ కోరింది.
ప్రస్తుతం కొనసాగిస్తామని, కొన్ని రోజులు పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకుంటామని బోర్డు పేర్కొంది.
తెలంగాణపై అభ్యంతరాలు
విద్యుత్తు ఉత్పత్తి పేరుతో ప్రాజెక్టులను ఖాళీ చేస్తూ నీటిని వాడుతున్నందున ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. న్యాయపరమైన అంశాలు
పలు కీలక అంశాలు న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున పెద్ద చర్చలు జరగలేదు.