Loading...
AP: ఆగస్టు 1 నుంచి రైతుబజార్లు, రైస్‌మిల్లుల్లో తక్కువ ధరకే బియ్యం విక్రయం
ఆగస్టు 1 నుంచి రైతుబజార్లు, రైస్‌మిల్లుల్లో తక్కువ ధరకే బియ్యం విక్రయం

AP: ఆగస్టు 1 నుంచి రైతుబజార్లు, రైస్‌మిల్లుల్లో తక్కువ ధరకే బియ్యం విక్రయం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 130 రైతుబజార్లుతో పాటు 500 రైస్‌మిల్లుల వద్ద ఆగస్టు 1 నుంచి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బియ్యం విక్రయాలు చేపట్టనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బీపీటీ, కేఎన్‌ఎం స్టీమ్ బియ్యం కిలోను రూ.52, ముడి బియ్యం కిలోను రూ.50 చొప్పున విక్రయించనున్నారు. అలాగే గ్రేడ్-2 బియ్యం కిలో ధరను రూ.42గా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

వివరాలు 

బియ్యం ధరలు, మార్కెట్ పరిస్థితులపై సమీక్ష

ఈ అంశంపై గురువారం సచివాలయంలో రైస్‌మిల్లర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమై బియ్యం ధరలు, మార్కెట్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

అంతర్జాతీయ పరిణామాలు, రవాణా వ్యయాల పెరుగుదల ప్రభావంతో బియ్యం సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం అందించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ సుధీర్, సంబంధిత అధికారులు, రైస్‌మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

ADVERTISEMENT