Page Loader
Senthil Balaji: తమిళనాడు మాజీ రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు 
తమిళనాడు మాజీ రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు

Senthil Balaji: తమిళనాడు మాజీ రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2024
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరు అయింది. క్యాష్ ఫర్ జాబ్స్ (మనీల్యాండరింగ్) కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు తాజాగా బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. సెంథిల్ బాలాజీని మానీల్యాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత ఏడాది జూన్‌లో అరెస్ట్ చేసింది. ఈ కేసులో, 2011-2015 మధ్య తమిళనాడు రవాణాశాఖలో ఉద్యోగాలు అందిస్తామని నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఈడీ ఆరోపించింది. జూన్ 15న మనీల్యాండరింగ్‌కు సంబంధించిన ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆయన మంత్రిత్వ శాఖను తొలగించింది.

వివరాలు 

మూడుసార్లు బెయిల్ తిరస్కరించిన స్థానిక కోర్టు 

తరువాత, సెంథిల్ బాలాజీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ 19న ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా, హైకోర్టు దానిని కొట్టివేసింది. స్థానిక కోర్టు కూడా అతని బెయిల్ పిటిషన్లను మూడుసార్లు తిరస్కరించింది. ఈ పరిస్థితిలో, సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఇటీవల బెయిల్ మంజూరు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు