Loading...
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ప్రభావం.. సముద్రంలో చిక్కుకున్న భారీ కార్గో నౌక
అర్నబ్ తుపాను ప్రభావం.. సముద్రంలో చిక్కుకున్న భారీ కార్గో నౌక

Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ప్రభావం.. సముద్రంలో చిక్కుకున్న భారీ కార్గో నౌక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అర్నబ్ తుపాను ప్రభావంతో సముద్రంలో భారీ కార్గో నౌక చిక్కుకుంది. విశాఖపట్టణం నుంచి సింగపూర్‌కు వెళ్తున్న ఈ నౌకలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన భారత తీర రక్షక దళం (కోస్ట్ గార్డ్) సహాయక చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. మార్షల్ ఐలాండ్స్‌కు చెందిన 'సిగ్మా పెరల్' అనే కార్గో నౌక విశాఖపట్నం పోర్టులో సరుకును దించిన తర్వాత సింగపూర్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో కేజీ బేసిన్‌లోని రవ్వా ఆయిల్ ఫీల్డ్ సమీపానికి చేరుకోగానే తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో నౌక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి ఆగిపోయింది. దీంతో నౌక ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్.. సుజయ్ నౌకతో సహాయక చర్యలు

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశారు.

సమాచారం అందుకున్న భారత తీర రక్షక దళం అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు కేంద్రంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

నౌకలో చిక్కుకున్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు 'సుజయ్' అనే కోస్ట్ గార్డ్ నౌకను ఘటనా స్థలానికి పంపించారు.

ప్రస్తుతం సిబ్బందిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT