
ఆరుద్ర భార్య, ప్రముఖ రచయిత కె.రామలక్ష్మి కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ రచయిత, ఆరుద్ర భార్య కె.రామలక్ష్మి శుక్రవారం కన్నుమూశారు. వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రామలక్ష్మీ 1930, డిసెంబరు 31న తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు.
1954లో కవి, సాహిత్యవిమర్శకుడు ఆరుద్రను పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.
ఆరుద్ర
1951 నుంచి రచనలు చేస్తున్న రామలక్ష్మి
1951 నుంచి రామలక్ష్మి రచనలు చేస్తున్నారు. తెలుగు స్వతంత్రలోని ఇంగ్లిష్ విభాగానికి ఆమె సబ్ ఎడిటర్‌గా కూడా పని చేశారు. పలు అనువాదాలు రాశారు. శుక్రవారం సాయంత్రమే రామలక్ష్మి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
విడదీసే రైలుబళ్లు, అవతలిగట్టు, మెరుపుతీగె, తొణికిన స్వర్గం, మానని గాయం, అణిముత్యం, పెళ్లి, ప్రేమించు ప్రేమకై, ఆడది, ఆశకు సంకెళ్లు, కరుణ కథ, లవంగి, ఆంధ్ర నాయకుడు, పండరంగని ప్రతిజ్ఞ అనే నవలలను రామలక్ష్మి రాశారు.
గృహలక్ష్మి స్వర్ణకంకణం అనే పురస్కారాన్ని ఆమె పొందారు.