Arun Goel: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. వచ్చే వారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో అరుణ్ గోయల్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2027 వరకు ఆయన పదవీకాలం ఉన్నా.. ఆయన ఆయన హఠాత్తుగా రాజీనామా చేయడం జాతీయ స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్‌లో ముగ్గురు సభ్యులు ఉండాలి. అందులో ఇప్పుడు అరుణ్ గోయల్ రాజీనామాతో చేశారు. మరో ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. దీంతో సీఈసీ ప్యానెల్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు.
ఎవరు ఈ అరుణ్ గోయల్?
అరుణ్ గోయల్ పంజాబ్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 2019లో కేంద్ర కేబినెట్ కార్యాలయ కార్యదర్శి పదవి నుంచి పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత నవంబర్ 2022లో ఆయన ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. దీనికి గల కారణాలపై ఎలాంటి సమాచారం వెలువడలేదు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించినట్లు గెజిట్ విడుదల చేశారు.