Tulip Garden: తెరుచుకున్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ తోట .. భారీగా తరలివచ్చిన పర్యాటకులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియాలో అతిపెద్ద తులిప్ తోటగా పేరొందిన శ్రీనగర్‌లోని 'ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్' ఈ సంవత్సరానికి సందర్శకుల కోసం ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ తోటలను అధికారికంగా ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తొలి రోజునే భారీ సంఖ్యలో పర్యాటకులు, స్థానిక ప్రజలు తోటకు చేరుకుని రంగురంగుల తులిప్ పూల అందాలను ఆస్వాదించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 70 రకాల తులిప్ మొక్కలకు చెందిన సుమారు 18 లక్షల బల్బులను నాటారు. ఇవి విభిన్న రంగుల్లో వికసిస్తూ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. పర్యాటకులకు సౌకర్యంగా ఉండేలా ఆన్‌లైన్ టికెట్ సదుపాయం కూడా కల్పించారు. అదనంగా, సందర్శకుల్లో ఉత్సాహం పెంచేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్రీనగర్ గార్డెన్‌లో 70 రకాల తులిప్ పూల సందడి..
VIDEO | J&K: A colourful carpet of tulips in various hues has once again transformed Srinagar, as Asia’s largest tulip garden on the banks of Dal Lake opened its gates to visitors on Monday.
— Press Trust of India (@PTI_News) March 16, 2026
Chief Minister Omar Abdullah inaugurated the expansive Indira Gandhi Memorial Tulip… pic.twitter.com/Z81PYNjrWB