Page Loader
భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు
భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు

భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు

వ్రాసిన వారు Stalin
Apr 17, 2023
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్యాంగ్‌స్టర్‌గా అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అష్రఫ్‌ను హతమార్చిన ముగ్గురు షూటర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్ జైలు నుంచి ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు బదిలీ చేశారు. భద్రతా కారణాల నిమిత్తం ముగ్గురు హంతకులు లవలేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యలను ప్రతాప్‌గఢ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ క్రమంలో తొలుత నైని జైలుకు తరలించారు.

యూపీ

ముగ్గురు హంతకుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు

ప్రతాప్‌గఢ్ జిల్లా జైలులో ముగ్గురు నిందితులను ఇతర ఖైదీల నుంచి వేరుగా ఉంచారు. వారికి ప్రత్యేకమైన భద్రతను ఏర్పాటు చేశారు. వారిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. న్యాయవాది ఉమేష్ పాల్ హత్యతో సహా 100కి పైగా కేసుల్లో వాంటెడ్ గా ఉన్న అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను ప్రయాగ్‌రాజ్‌లో వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా ఈ ముగ్గురు కాల్చి చంపారు. ముగ్గురు షూటర్లు జర్నలిస్ట్‌గా చెప్పుకొని, మీడియా కెమెరాల ముందే అహ్మద్ సోదరులను పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చారు. హత్య జరిగిన వెంటనే హంతకులు లొంగిపోయారు.