Page Loader
Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు 

Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు 

వ్రాసిన వారు Stalin
Apr 17, 2023
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అష్రఫ్ మృతదేహాలకు నిర్వహించిన శవ పరీక్షల వివరాలను పోలీసులు వెల్లడించారు. అతిక్ అహ్మద్ శరీరంలో తొమ్మిది బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతిక్ అహ్మద్, అష్రఫ్‌ను శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రి వెలుపల ముగ్గురు వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోనే కాకుండా రాష్ట్రంలోనే సంచలనంగా మారింది.

యూపీ

అష్రఫ్ శరీరంలో ఐదు బుల్లెట్ గాయాలు 

అతిక్ అహ్మద్ తలపై ఒకసారి, ఛాతీ, వీపుపై ఎనిమిది సార్లు కాల్చినట్లు శవపరీక్షలో తేలిందని పోలీసులు తెలిపారు. అతిక్ అహ్మద్, అష్రఫ్‌పై కాల్పులు జరిపిన ముగ్గురు షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు. అష్రఫ్ శరీరంలో ఐదు బుల్లెట్ గాయాలు కనిపించాయి. ముఖంపై ఒకటి, అతని వెనుక భాగంలో నాలుగు బుల్లెట్లను గుర్తించిన్టలు తెలిపారు. ఐదుగురు వైద్యులతో కూడిన బృందం పోస్టుమార్టం నిర్వహించింది. హై ప్రొఫైల్ కేసు కావడంతో విచారణకు ఉపయోగపడేలా పోస్టుమార్టంను రికార్డు చేశారు. మాజీ ఎమ్మెల్యే, ఎంపీ అయిన అతిక్ అహ్మద్ కనీసం 100 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.