Page Loader
మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా? 
మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా?

మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా? 

వ్రాసిన వారు Stalin
Apr 17, 2023
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కస్డడీలో ఉన్న వీరు హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే కొన్నిరోజుల క్రితం అతిక్ తమ్ముడు అష్రఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అతిక్‌తో పాటు తనను రెండు వారాల్లో చంపేస్తానని ఓ సీనియర్ పోలీసు అధికారి బెదిరించాడని మార్చి 28న విలేకరులతో చెప్పాడు. ఏదో ఒక కారణం చూపి ఇద్దరు అన్నదమ్ములను జైలు నుంచి బయటకు తీసుకువెళ్లి చంపేస్తారని ఆ సీనియర్ అధికారి చెప్పినట్లు అష్రఫ్ బరేలీ జైలుకు తీసుకువచ్చినప్పుడు వ్యానులో కూర్చొని విలేకరులతో చెప్పాడు.

యూపీ

యాదృచ్చికంగా అష్రఫ్ చెప్పినట్లుగానే హత్య

అష్రఫ్ మాట్లాడిన కొన్నిరోజుల తర్వాత తర్వాత యాదృచ్చికంగా శనివారం (ఏప్రిల్ 15), పోలీసు సిబ్బంది వారిని చెకప్ కోసం ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి తీసుకువెళుతుండగా జర్నలిస్టులుగా వచ్చిన ముగ్గురు అష్రఫ్, అతిక్ అహ్మద్‌లను పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. యోగి ఆదిత్యనాథ్ తనపై నకిలీ కేసులు కూడా పెట్టారని అష్రాఫ్ మార్చి 28న వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, సీజేఐ, అలహాబాద్ ప్రధాన న్యాయమూర్తికి కూడా ఆ అధికారి పేరును వెల్లడిస్తానని అష్రఫ్ పేర్కొన్నాడు. ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఉమేష్ పాల్ అపహరణ కేసులో అతిక్‌కి జీవిత ఖైదు విధించింది. అతిక్ అహ్మద్, అష్రఫ్‌లను ఆదివారం వారి పూర్వీకుల గ్రామంలో గట్టి భద్రత మధ్య ఖననం చేశారు.