Loading...
Auto strike: తెలంగాణలో ఆటోల బంద్‌.. నేటి అర్ధరాత్రి నుంచే నిరవధిక సమ్మె!
తెలంగాణలో ఆటోల బంద్‌.. నేటి అర్ధరాత్రి నుంచే నిరవధిక సమ్మె!

Auto strike: తెలంగాణలో ఆటోల బంద్‌.. నేటి అర్ధరాత్రి నుంచే నిరవధిక సమ్మె!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఆటో, క్యాబ్‌, పాఠశాల వ్యాన్‌ డ్రైవర్ల దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంకె. బోసు డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న డ్రైవర్ల నిరవధిక బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో కదలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త నల్లెల కిశోర్‌ ఆధ్వర్యంలో శనివారం దోమలగూడలో బంద్‌ గోడపత్రికను ఆవిష్కరించారు.

వివరాలు

డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఈ సందర్భంగా మాట్లాడిన ఎంకె. బోసు.. ఆటో, క్యాబ్‌, పాఠశాల వ్యాన్‌ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలను తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ నిర్ణయం ప్రైవేటు రవాణా రంగంపై ఆధారపడిన డ్రైవర్లపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

అలాగే ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్మిక సంఘాల ఐకాస పిలుపుతో చేపట్టనున్న నిరవధిక బంద్‌కు డ్రైవర్లు, కార్మికులు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని బోసు విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT