LOADING...
Aviation Fuel: కాకినాడలో ఏవియేషన్‌ ఇంధన తయారీ కేంద్రానికి 45 ఎకరాల భూమి కేటాయింపు
కాకినాడలో ఏవియేషన్‌ ఇంధన తయారీ కేంద్రానికి 45 ఎకరాల భూమి కేటాయింపు

Aviation Fuel: కాకినాడలో ఏవియేషన్‌ ఇంధన తయారీ కేంద్రానికి 45 ఎకరాల భూమి కేటాయింపు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 28, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాకినాడలో ఏవియేషన్‌ ఇంధన (ఏవియేషన్‌ ఫ్యూయల్‌) తయారీ కేంద్రం స్థాపనకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు అమలుకు ఎస్‌ఏఎఫ్‌ వన్‌ ఇండియా ఎస్‌పీకోమ్‌పాక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఏపీ మారిటైమ్‌ బోర్డుకు చెందిన 45 ఎకరాల భూమిని కేటాయించేందుకు శనివారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుకు సంస్థ సుమారు రూ.1,835 కోట్ల పెట్టుబడిని పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

వివరాలు

15 నెలల వ్యవధిలోపు ప్రాజెక్టు అభివృద్ధి పనులు ప్రారంభం..

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఏపీ మారిటైమ్‌ బోర్డు ఈ 45 ఎకరాల భూమిని సంస్థకు 30 సంవత్సరాల లీజు ప్రాతిపదికన కేటాయించాలి. అలాగే, అమలులో ఉన్న నిబంధనలకు అనుగుణంగా లీజు రుసుమును నిర్ణయించాల్సి ఉంటుంది. భూమి కేటాయింపు పూర్తైన తేదీ నుంచి 15 నెలల వ్యవధిలోపు ప్రాజెక్టు అభివృద్ధి పనులను ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Advertisement