LOADING...
Rashmika Mandanna : అల్లు అర్జున్ 'రాకా'లో రష్మిక ఎంట్రీ? సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం
అల్లు అర్జున్ 'రాకా'లో రష్మిక ఎంట్రీ? సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం

Rashmika Mandanna : అల్లు అర్జున్ 'రాకా'లో రష్మిక ఎంట్రీ? సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 27, 2026
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

'పుష్ప' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్-రష్మిక మందన్న జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రాకా'లో రష్మిక కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సమాచారం ప్రకారం, త్వరలో ముంబయిలో ప్రారంభం కానున్న తాజా షూటింగ్ షెడ్యూల్‌లో రష్మిక పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప' సిరీస్‌లో అల్లు అర్జున్, రష్మిక మధ్య కనిపించిన కెమిస్ట్రీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన నేపథ్యంలో, ఈ కొత్త ప్రాజెక్టులో కూడా వారి కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది.

వివరాలు

భారీ బడ్జెట్‌తో మూవీ..

ఇదే చిత్రంలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారనే ప్రచారం కొనసాగుతోంది. అయితే రష్మిక, షారుక్ ఖాన్ పాత్రలతో పాటు ఇతర వార్తలపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు, త్వరలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో దర్శకుడు అట్లీ, హీరో అల్లు అర్జున్, నటి దీపికా పదుకొణె పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు రూ.700 కోట్ల భారీ వ్యయంతో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

Advertisement