Page Loader
Ram Mandir: అయోధ్య రామాలయంలో మారిన హారతి, దర్శన సమయాలు.. మీరూ తెలుసుకోండి 
Ram Mandir: అయోధ్య రామాలయంలో హారతి, దర్శన సమయాలు ఇవే.. మీరూ తెలుసుకోండి

Ram Mandir: అయోధ్య రామాలయంలో మారిన హారతి, దర్శన సమయాలు.. మీరూ తెలుసుకోండి 

వ్రాసిన వారు Stalin
Jan 27, 2024
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ట్రస్ట్ అప్రమత్తమైంది. భక్తుల రద్దీ నేపథ్యంలో హారతి, దర్శన సమయాల్లో ఆలయ ట్రస్ట్ మార్పులు చేసింది. కొత్త హారతి, దర్శన సమయాలను ఇపుడు తెలుసుకుందాం. సవరించిన సమయాల ప్రకారం.. ఉదయం 4:30 గంటలకు శ్రీరాముడి విగ్రహానికి హారతి, 6:30 గంటలకు మంగళ ప్రార్ధన నిర్వహిస్తారు. భక్తులు ఉదయం 7గంటల నుంచి ఆలయాన్ని సందర్శించవచ్చు. మధ్యాహ్నం భోగ్ పూజలు, సాయంత్రం 7:30 గంటలకు హారతి నిర్వహిస్తారు. సాయంత్రం 8గంటలకు మరోసారి భోగ్ పూజలు నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు స్వామివారికి శయన హారతి నిర్వహిస్తారని విశ్వహిందూ పరిషత్ ప్రావిన్షియల్ అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌ఛార్జ్ శరద్ శర్మ తెలిపారు.

అయోధ్య

భక్తుల భద్రతలు వసతి, భద్రత

ఆలయ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు వసతి కల్పించడానికి పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినప్పటికీ ఏర్పాట్లతో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నట్లు లక్నో జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) పీయూష్ మోర్డియా తెలిపారు. పియూష్ మోర్డియా మాట్లాడుతూ.. ఆలయంలో దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ, ప్రతి ఒక్కరూ శ్రీరాముని 'దర్శనం' పొందవచ్చు అన్నారు. ఆలయాన్ని సందర్శించేటప్పుడు ప్రజలు తమ సామాను, బ్యాగ్‌లను తీసుకెళ్లవద్దని ఆయన అభ్యర్థించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో ఏర్పాటు చేసిన క్లోక్‌రూమ్‌లలో తమ వస్తువులను ఉంచాలని సూచించారు.