Banarasi Weavers: టీ20 వరల్డ్‌కప్ థీమ్‌తో బనారసీ ప్రత్యేక చీర
ఈ వార్తాకథనం ఏంటి
మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ కప్ మ్యాచ్‌లు మొదలైతే దేశమంతా క్రికెట్ మాయలో మునిగిపోతుంది. అభిమానులు తమ ప్రేమను వినూత్నంగా వ్యక్తపరచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్నటీ20 ప్రపంచకప్‌ను గుర్తుండిపోయేలా నిలిపేందుకు వారణాసికి చెందిన చేనేతకారులు ప్రత్యేక ఆలోచనతో ముందుకు వచ్చారు. బనారసీ సంప్రదాయ శైలిలో క్రికెట్ థీమ్‌తో కూడిన ప్రత్యేక చీరను వారు రూపొందించారు. వెండి జరీతో నేసిన ఈ చీరపై పురుషుల,మహిళల టీ20 ప్రపంచ కప్ ట్రోఫీలు స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశారు. ఈ చీర తయారికి సుమారు 20రోజులు సమయం పట్టిందని చేనేతకారులు తెలిపారు. ఈ ప్రత్యేక చీర ధర దాదాపు రూ.35వేల వరకు ఉంటుందని వారు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
క్రికెట్ క్రేజ్‌కు చేనేత కళ మేళవింపు
#ministryoftextilesGoI
— ICCR in Australia (@ICCR_Australia) February 10, 2026
This T20 World Cup is finding expression beyond the stadium. In Varanasi, weavers have handwoven cricket-inspired Banarasi silk saris as a cultural tribute to the Indian cricket team and its legacy over the years. pic.twitter.com/WmfT5Rahsh