Loading...
Another Cyclone: అర్నబ్ తుఫాను ముప్పు ముగియకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!
అర్నబ్ తుఫాను ముప్పు ముగియకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

Another Cyclone: అర్నబ్ తుఫాను ముప్పు ముగియకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ నమూనాల అంచనాలు తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అర్నబ్ తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గకముందే మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడవచ్చన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. అక్టోబర్ 27 నాటికి బంగాళాఖాతంలో రెండు వ్యవస్థలు చురుగ్గా ఉన్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ఒకవైపు అర్నబ్ తుఫాను ఉండగా,మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ను ప్రభావితం చేసిన అర్నబ్ తుఫాను కోనసీమ మీదుగా తీరం దాటింది.గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీరం దాటే సమయంలో తుఫాను కొంత బలహీనపడినా, దాని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తుఫాను కదలికలను నిరంతరం పరిశీలిస్తోంది.

వివరాలు 

మరో తుఫానుపై అధికారిక హెచ్చరిక జారీ ఐఎండీ

ఇదిలా ఉండగా, నవంబర్ 1, 2 తేదీల మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.

ఈ వ్యవస్థ ఒడిశా తీరం వైపు కదిలే అవకాశాన్ని ఈసీఎండబ్ల్యూఎఫ్‌, ఐఎండీ జీఎఫ్‌ఎస్‌ నమూనాలు సూచిస్తున్నాయి.

అయితే, అన్ని వాతావరణ నమూనాలు ఒకే అంచనాకు రాలేదు. గతంలో అర్నబ్ తుఫాను తీరం దాటే సమయంపై కొన్ని అంచనాలు తప్పిన నేపథ్యంలో, కొత్త వ్యవస్థపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఐఎండీ కూడా ఇప్పటివరకు మరో తుఫానుపై అధికారిక హెచ్చరిక జారీ చేయలేదు.

వివరాలు 

ప్రజలుఐఎండీ అందించే సూచనలను మాత్రమే పాటించాలని అధికారులు విజ్ఞప్తి  

కొత్త అల్పపీడనం బలపడి తుఫానుగా మారితే ఒడిశా తీర జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే ప్రమాదం ఉంది.

వరుసగా తుఫానులు ఏర్పడితే వరదలు, పంట నష్టం పెరగడంతోపాటు సహాయక చర్యలపైనా ఒత్తిడి పడే అవకాశం ఉంది.

అయితే, మరో తుఫాను ఏర్పడటం ఇంకా ఖరారు కాలేదు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందకుండా ఐఎండీ అందించే సూచనలను మాత్రమే పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు

అర్నబ్ తుఫాను పూర్తిగా బలహీనపడిన తర్వాతే తదుపరి వాతావరణ వ్యవస్థపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వదంతులను నమ్మకుండా ఐఎండీ సూచనలను పాటించడం, తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటం అవసరం.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం?

ADVERTISEMENT