
Heavy Rains Today : రానున్న మూడు గంటలు జాగ్రత్త.. భారీ వర్షాలతో పాటు పిడుగుపాటు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అదనంగా, పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్ల కింద కాకుండా, ఇంట్లోనే సురక్షితంగా ఉండటానికి ప్రజలు జాగ్రత్త వహించాలి. వర్షకాలంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
Details
రెడ్ అలెర్ట్
విజయనగరం, విశాఖ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అరెంజ్ అలెర్ట్ నెల్లూరు, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ఎల్లో అలెర్ట్ పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు