Page Loader
సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బెంగాల్ ఆహార మంత్రిపై ఈడీ దాడులు  
సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బెంగాల్ ఆహార మంత్రిపై ఈడీ దాడులు

సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బెంగాల్ ఆహార మంత్రిపై ఈడీ దాడులు  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 05, 2023
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి రతిన్ ఘోష్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం దాడులు చేసింది. మనీలాండరింగ్ విచారణలో భాగంగా కోల్‌కతాలోని మంత్రి ఇంటితోపాటు 13 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఘోష్ మధ్యంగ్రామ్ మునిసిపాలిటీ మాజీ ఛైర్మన్, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులను రిక్రూట్ చేయడానికి స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఘోష్,అతని సహచరులు ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుండి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ED పరిశీలిస్తోంది.సోదాలు కొనసాగుతున్నాయి,ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 బెంగాల్ ఆహార మంత్రిపై ఈడీ దాడులు