Page Loader
Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ 
Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ

Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ 

వ్రాసిన వారు Stalin
Mar 13, 2024
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం బెంగళూరు కేఫ్‌లో పేలుడు కేసులో నిందితుడిని అరెస్టు చేసింది. నిందితుడిని షబ్బీర్‌గా గుర్తించినట్లు, అతడిని కర్ణాటకలోని బళ్లారిలో అరెస్టు చేసిటన్లు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వర్గాలు తెలిపాయి. అనుమానితుడిని విచారించి, పేలుడు కేసులో అన్వేషిస్తున్న నిందితుడు ఇతడేనా? అని నిర్ధారించడానికి ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మార్చి 1వ తేదీన బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు వల్ల 9 మంది గాయపడ్డారు.

ఎన్ఐఏ

సీసీపుటేజీ ఆధారంగా..

తొలుత గ్యాస్‌ సిలిండర్‌ పేలుడుగా భావించినా.. ఆ తర్వాత పేలుడుకు ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌ (ఐఈడీ) వినియోగించినట్లు తెలింది. దీంతో ఈ కేసును కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేసి, NIAకి అప్పగించారు. అనుమానితుడు ఐఈడీ బాంబు ఉన్న బ్యాగ్‌ను కేఫ్‌లోనే ఉంచి టైమర్‌తో పేల్చినట్లు సీసీపుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు కేఫ్‌లోకి ఇడ్లీ ప్లేటును తీసుకెళ్లడం కనిపించింది. అతని భుజానికి ఒక బ్యాగ్ వేలాడుతూ ఉంది. ఈ బ్యాగ్‌లో ఐఈడీ బాంబు ఉన్నట్లు భావిస్తున్నారు. మరో సీసీటీవీ ఫుటేజీలో బ్యాగ్‌తో కేఫ్‌ వైపు వెళ్లడం కూడా కనిపించింది.