Page Loader
రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే 
రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే 

వ్రాసిన వారు Stalin
Jan 14, 2024
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివారం మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' ప్రారంభమైంది. ఈ యాత్రను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయజెండా ఊపి ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. 10 ఏళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఎండగడుతూ ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. యాత్రను ప్రారంభించే ముందు రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఖోంగ్‌జోమ్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. 1891లో బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన మణిపూర్ స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకార్థం ఈ స్మారకాన్ని నిర్మించారు.

కాంగ్రెస్

67 రోజుల్లో ప్రతి రోజు రెండు సభల్లో రాహుల్ ప్రసంగం

న్యాయ యాత్రను ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ తౌబాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. పేదలు, అణగారిన, దోపిడీకి గురవుతున్న వారికి న్యాయం చేయడం కోసం ఈ యాత్ర చేపడుతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ చేపట్టిన ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాల గుండా 6,700 కిలోమీటర్లకు పైగా సాగనుంది. 15 రాష్ట్రాలు, 100 లోక్‌సభ స్థానాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్ర మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్రలోని ముంబైకి చేరుకుంటుంది. ఈ యాత్రలో రాహుల్ ప్రతిరోజూ 2 బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు,

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జాతీయ జెండా ఊపి యాత్రను ప్రారంభించిన ఖర్గే