NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / LK Advani: పాకిస్థాన్‌లో పుట్టి.. భారతరత్నగా ఎదిగి.. అద్వానీ రాజకీయ జీవితంలో కీలక పరిణామాలు ఇవే 
    తదుపరి వార్తా కథనం
    LK Advani: పాకిస్థాన్‌లో పుట్టి.. భారతరత్నగా ఎదిగి.. అద్వానీ రాజకీయ జీవితంలో కీలక పరిణామాలు ఇవే 
    LK Advani: పాకిస్థాన్‌లో పుట్టి.. భారతరత్నగా ఎదిగి.. అద్వానీ రాజకీయ జీవితంలో కీలక పరిణామాలు ఇవే

    LK Advani: పాకిస్థాన్‌లో పుట్టి.. భారతరత్నగా ఎదిగి.. అద్వానీ రాజకీయ జీవితంలో కీలక పరిణామాలు ఇవే 

    వ్రాసిన వారు Stalin
    Feb 03, 2024
    02:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Bharat Ratna LK Advani: బీజేపీ దిగ్గజ నాయకుడు ఎల్‌కే అద్వానీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను ప్రకటించింది.

    భారత రాజకీయాలపై ఎల్‌కే అద్వానీ తనదైన ముద్రవేశారు. బీజేపీ నేడు తిరుగులేని శక్తిగా ఎదగడానికి అద్వానీ ఎనలేని కృషి చేశారు.

    దశాబ్దాల రాజకీయ పార్లమెంటరీ కెరీర్‌లో హోం మంత్రి, ఉప ప్రధానమంత్రి, ప్రసార మంత్రి ఎన్నో కీలక పదవులను నిర్వహించి.. తన మార్కును చాటుకున్నారు.

    డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేతకు తనను తానే 'రథసారథి'గా అభివర్ణించుకున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణలో బాబ్రీ మసీదు కూల్చివేత కీలక పరిణామం అని చెప్పాలి.

    పాకిస్థాన్‌లో పుట్టి.. భారతరత్నగా ఎదిగిన ఎల్‌కే అద్వానీ జీవితంలో కీలక పరిణామాలను ఓసారి గుర్తు చేసుకుందాం.

    అద్వానీ

    1927లో పాకిస్థాన్‌లో జన్మించిన అద్వానీ

    నవంబర్ 8, 1927: ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో కిషన్‌చంద్, జ్ఞానీదేవి అద్వానీలకు ఎల్‌కె అద్వానీ జన్మించారు.

    1936 -1942: కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్‌లో చదువుకున్నారు, మెట్రిక్యులేషన్ వరకు ప్రతి తరగతిలో మొదటి స్థానంలో నిలిచారు.

    1942: ఆర్‌ఎస్‌ఎస్‌లో స్వయంసేవక్‌గా చేరారు.

    1942: క్విట్ ఇండియా ఉద్యమంలో దయారామ్ గిడుమల్ నేషనల్ కాలేజీ, హైదరాబాద్‌లో చేరారు.

    1944: కరాచీలోని మోడల్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేశారు.

    సెప్టెంబర్ 1947: విభజన సమయంలో ఆయన దిల్లీకి వచ్చారు.

    1947-1951: కరాచీ శాఖకు ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా అల్వార్, భరత్‌పూర్, కోట, బుండి, ఝలావర్‌లలో పని చేశారు.

    1957: అటల్ బిహారీ వాజ్‌పేయికి సహాయం చేయడానికి అనంతరం ఆయన తన మకాం మళ్లీ దిల్లీకి మార్చారు.

    అద్వానీ

    1970లో తొలిసారి చట్టసభలోకి అడుగపెట్టిన అద్వానీ

    1958-63: దిల్లీ రాష్ట్ర జనసంఘ్ కార్యదర్శిగా నియామకమయ్యారు.

    1960-1967: జనసంఘ్ పొలిటికల్ జర్నల్‌లో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరారు.

    ఫిబ్రవరి 1965: కమల అద్వానీని వివాహం చేసుకున్నారు. వీరికి ప్రతిభ, జయంత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    ఏప్రిల్ 1970: రాజ్యసభకు ఎంపికై.. తొలిసారి చట్టసభలో అడుగుపెట్టారు.

    డిసెంబర్ 1972: భారతీయ జనసంఘ్ (BJS) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

    జూన్ 1975: ఎమర్జెన్సీ సమయంలో బెంగుళూరులో అరెస్ట్ అయ్యారు. కొంతకాలం ఆయన్ను బెంగుళూరు సెంట్రల్ జైళ్లోనే ఉంచారు.

    మార్చి 1977 - జూలై 1979 వరకు: జనతా ప్రభుత్వంలో సమాచార, ప్రసార మంత్రి పదవిని నిర్వహించారు.

    1980-86: బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు.

    అద్వానీ

    వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర హోమంత్రి, ఉప ప్రధానిగా.. 

    మే 1986: బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

    మార్చి 1988: బీజేపీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు.

    1988: బీజేపీ ప్రభుత్వంలో హోం మంత్రి పదవిని నిర్వహించారు.

    1990: సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రామరథ యాత్రకు శ్రీకారం చుట్టారు.

    1997: భారతదేశ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్వర్ణ జయంతి రథయాత్రను ప్రారంభించారు.

    అక్టోబర్ 1999-మే 2004: వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర హోమంత్రిగా పని చేశారు.

    జూన్ 2002-మే 2004: వాజ్‌పేయి నేతృత్వంలోనే రెండేళ్ల పాటు ఉప ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలను నిర్వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతరత్న
    బీజేపీ

    తాజా

    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర
    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్
    Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌ సర్ఫరాజ్ ఖాన్
    Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత శ్రేయస్ అయ్యర్

    భారతరత్న

    Bharat Ratna : అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి 70 ఏళ్లు.. ప్రారంభించింది ఎవరో తెలుసా లైఫ్-స్టైల్
    Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న' బిహార్
    Bharat Ratna: 'భారతరత్న' అవార్డును ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా?  భారతదేశం
     LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి 'భారతరత్న' బీజేపీ

    బీజేపీ

    Telangana Elections : 17న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ
    BJP JANASENA : 'పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు.. ఏపీలోనూ కలిసే వెళ్తాం' ఆంధ్రప్రదేశ్
    BJP manifesto: బీజేపీ మేనిఫెస్టో.. ఏడాదికి ఉచితంగా నాలుగు సిలిండర్లు.. కీలక హామీలు ఇవే తెలంగాణ
    BRS: బీఆర్ఎస్‌లో చేరిన  ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌ కుమారుడు బీఆర్ఎస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025