
AP SSC Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పది ఫలితాలు విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు (AP SSC Results) ఇవాళ విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను ప్రకటించారు.
ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల ఫలితాలు కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను (https://results.bse.ap.gov.in/) వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
అదేవిధంగా, 'మన మిత్ర' అనే వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా ఫలితాలను పొందొచ్చు.
ఇక తాజా ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 81.14గా నమోదైంది. అబ్బాయిలు 78.31 శాతం ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిలు 84.09 శాతం పాస్ అయ్యారు.
Details
6,19,275 మంది విద్యార్థులు హాజరు
ఈ సంవత్సరం మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
అందులో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు.
మాధ్యమం పరంగా చూస్తే, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 5,64,064 మంది కాగా, తెలుగు మాధ్యమం విద్యార్థులు 51,069 మంది ఉన్నారు.