LOADING...
బిహార్‌లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
బిహార్‌లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

బిహార్‌లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

వ్రాసిన వారు Stalin
Aug 07, 2023
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. కుల సర్వేకు అనుమతిస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఆగస్టు 14న విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మానసం పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ, ప్రస్తుతం కొనసాగుతున్న కులాల సర్వేపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మానసం మరికొంత కాలం కొనసాగించనివ్వండని పేర్కొన్నారు. తాము ఈ అభ్యర్థనను ఆగస్టు 14 వివరంగా వింటామని చెప్పారు. బిహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం కులాల సర్వే నిర్వహించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను ఆగస్టు 1న పాట్నా హైకోర్టు కొట్టివేసిసిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బిహార్ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు