
Bihar politics: 'చెత్త తిరిగి డస్ట్‌బిన్‌లోకే వెళ్లింది'.. నితీష్ కుమార్‌పై కాంగ్రెస్, ఆర్జేడీ నేతల ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో అధికార కూటమిని రద్దు చేస్తూ.. ఆదివారం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే నితీష్ తిరిగి ఎన్డీఏలోకి వెళ్లడంపై మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య విరుచుకుపడ్డారు.
చెత్త తిరిగి డస్ట్ బిన్ లోకి వెళ్లినట్లు విమర్శించారు. చెత్త కుప్పల్లోకి కంపుకొట్టే చెత్త వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె ట్వీట్
कूड़ा गया फिर से कूड़ेदानी में
— Rohini Acharya (@RohiniAcharya2) January 28, 2024
कूड़ा - मंडली को बदबूदार कूड़ा मुबारक pic.twitter.com/gQvablD7fC
బిహార్
'ఒకరితో పెళ్లి, మరొకరితో ఎఫైర్': కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్
బీహార్‌లో రాజకీయ గందరగోళం నేపథ్యంలో నితీశ్ కుమార్‌పై కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్ మండిపడ్డారు.
నితీష్ వ్యవహారంలో ఆశర్యం ఏమీ లేదన్నారు. రాజకీయాల్లో 'ఒకరతో పెళ్లి.. మరొకరితో ఎఫైర్' అన్న చందంగా నితీశ్ కుమార్ వ్యవహారం ఉందంటూ తారిఖ్ అన్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతృత్వంలోని ఇండియా కూటమికి నితీష్ కుమార్ వ్యవహారం భారీ ఎదురు దెబ్బ అని చెప్పాలి.
ముఖ్యంగా రాహుల్ గాంధీ.. భారత్ జోడో న్యాయ్ యాత్ర మరికొన్ని రోజుల్లో బిహార్‌లోకి అడుగుపెడుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తారిఖ్ అన్వర్ ట్వీట్
आश्चर्य की कोई बात नहीं है।शादी किसी के साथ और अफेयर किसी दूसरे के साथ।नीतीश कुमार का स्वभाव बन चुका है।
— Tariq Anwar (@itariqanwar) January 28, 2024